సిరాన్యూస్, జైనథ్
కథల పోటీల్లో విద్యార్థులు కీర్తి, శ్రావణిల ప్రతిభ
బాలల దినత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ సారస్వత పరిషత్తు ఉన్నత పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన కథా రచన పోటీల్లో కీర్తి, శ్రావణిల ప్రతిభ కనబర్చారు. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని లక్ష్మి పూర్ ఉన్నత పాఠశాల విద్యార్థులు తల్లెల కీర్తి, హెడావ్ శ్రావణి లు రాసిన కథలు రాష్ట్ర స్థాయి లో ప్రోత్సాహక బహుమతికి ఎంపికయ్యాయని ప్రధానోపాధ్యాయులు పోరెడ్డి అశోక్ తెలిపారు. కీర్తి రాసిన ” ధనవంతుడు – సైనికుడు ” , శ్రావణి రాసిన ” చిట్టెమ్మ టీచరు ” కథలు ఉత్తమ కథలుగా ఎంపికయ్యాయి. వీరికి నవంబర్ 15 వ తేదీన హైదరాబాద్ లోని తెలంగాణ సారస్వత పరిషత్తు డా. దేవులపల్లి రామానుజరావు కళామందిరంలో జరిగే బాలల సాంస్కృతికోత్సవంలో బహుమతులు అందజేయనున్నారు. సందర్భంగా విద్యార్థులను ఉపాధ్యాయులు హనుమంత్ రావు, బి. నారాయణ, రహీం, రాజేశ్వర్, పి. నారాయణ, మహేష్, విలాస్ లు, గ్రామపెద్దలు అభినందించారు.