విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి…

కమాన్ పూర్;
విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కౌన్సిలర్ కాజి మొహమ్మద్ ఇస్మాయిల్ నిజామి అన్నారు.
విద్యార్థుల కు బహుమతులను -టీఎంఆర్ ఈ ఐ ఎస్ కౌన్సెలర్ క్వాజీ ముహమ్మద్ ఇస్మాయిల్ నిజామీ అందజేశారు.
రామగుండం – బాలుర పాఠశాలలో జరిగిన 75 గణతంత్ర దినోత్సవ సందర్బంగా ముఖ్య అతిథిగా జెండా ఎగురవేయడం – పథకావిష్కరణ చేశారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి క్వాజీ ముహమ్మద్ ఇస్మాయిల్ నిజామీ మాట్లాడుతూ… విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు. క్రీడలు విద్యార్థులకు ఎంతో అవసరమని పూర్తి శిక్షణ నైపుణ్యత పెంపొందిస్తాయని అన్నారు. అలాగే మైనార్టీల సంక్షేమానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. రామగుండం నియోజకవర్గం లోని టి ఎం.ఆర్ ఈ ఐ ఎస్ పాఠశాలలను అభివృద్ధి చేస్తానని దీంతోపాటు మౌలిక వసతులను సదుపాయాలను ఏర్పాటు చేస్తానన్నారు. పాఠశాలల అభివృద్ధితో విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తానని వారు పేర్కొన్నారు. నియోజకవర్గంలోని పాఠశాలలో సమస్యలను మా దృష్టికి తీసుకువచ్చినట్లైతే వాటిని పరిష్కరిస్తానని అన్నారు. అలాగే పాఠశాలలకు సంబంధించి ఇతర వస్తువులతో పాటు విద్యార్థులకు ఉపయోగపడే విధంగా అన్ని రకాల సదుపాయాలను ఏర్పాటుచేసి ఉన్నత విద్య అభివృద్ధి కోసం కృషి చేస్తానని ఇస్మాయిల్
విద్యార్థులకు తెలిపారు. అనంతరం పలు క్రీడల్లో ప్రతిభ కనబరిచి గెలుపొందిన విద్యార్థులకు కౌన్సిలర్ తన చేతుల మీదుగా బహుమతులను అందజేసి విద్యార్థులను అభినందించారు. ఇలాగే ముందు ముందు కూడా ఇంకా ఎన్నో పోటీల్లో పాల్గొని భవిష్యత్తులో మరిన్ని బహుమతులను అందుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు కొప్పుల శ్రీధర్, కో ఆర్డినేటర్- గోపి సర్, మైనార్టీ నాయకులు-ఫసియుద్దీన్, అబ్దుల్ సత్తార్, పాఠశాల అధ్యాపకులు, సిబ్బంది విద్యార్థులు, తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *