సిరా న్యూస్, ఖానాపూర్
బదిలీపై వెళ్తున్నసబ్ రిజిస్టర్ ఇమ్రాన్ ఖాన్ ఘన సన్మానం
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో సబ్ రిజిస్టర్ గా విధులు నిర్వహించిన ఇమ్రాన్ ఖాన్ బదిలీపై జగిత్యాల జిల్లా మల్యాల సబ్ రిజిస్టర్ గా వెళ్తున్నారు. ఈసందర్బంగా సబ్ రిజిస్టర్ అధికారి ఇమ్రాన్ ఖాన్‌ను శనివారం ఖానాపూర్ దస్తావేజు లేఖర్లు శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఇటీవలే ఖానాపూర్ సబ్ రిజిస్టర్ కార్యాలయానికి బదిలీపై వచ్చిన జూనియర్ అసిస్టెంట్ కపిల్ ను సైతం దస్తావేజు లేఖర్లుఘనంగా శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో దస్తావేజులేఖర్లు చింతపండు రవి కుమార్ , పల్లికొండ జనార్ధన్, పరిమి శ్రీనివాస్, ఆమంద రాజ శేఖర్, ముధం వైశాలి, పూదరి పరమేష్, తదితరులు పాల్గొన్నారు.