సిరా న్యూస్,పెద్దపల్లి;
: రాష్ట్ర వైద్య మండలి చైర్మన్ డా. మహేష్ కుమార్, రిజిస్ట్రార్ డాక్టర్ లాలయ్య ఆదేశాల మేరకు సభ్యులు డా. రాజకుమార్ ఆధ్వర్యంలో టిజీఎంసి తనిఖీ బృందం పెద్దపల్లి, సుల్తానాబాద్ లలో నకిలీ అల్లోపతి వైద్యుల సెంటర్స్ పై తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో పెద్దపల్లిలోని లోటస్ హాస్పిటల్, పురుషోత్తం, ఇమ్రాన్ బోన్ సెట్టింగ్స్ సెంటర్, వైఎస్అజీజ్ క్లినిక్, సుల్తానాబాద్ లోని నీలకంటేశ్వర్ మెడికల్ షాప్ మల్లేశం, మణికంఠ క్లినిక్ చిన్న రమేష్ పేరుతో అర్హత లేకుండా పలు సెంటర్స్ ఓపెన్ చేసి వైద్యం చేస్తున్నారని వెలుగులోకి వచ్చిందని తనిఖీ బృందం సభ్యులు తెలిపారు. ఈ తనిఖీల గురించి సమాచారం తెలుసుకుని నకిలీ వైద్యులు వారి క్లినిక్ లు, ల్యాబ్స్, పర్మిషన్ లేని మెడికల్ షాపులు మూసి వేశారని పేర్కొన్నారు. అర్హతలేనివారు వైద్యులుగా చెలామణి అవుతూ ఆంటిబయోటిక్స్, స్టెరోయిడ్స్ ఇస్తునట్టు గుర్తించి తగు ఆధారాలు సేకరించామని తనిఖీ బృందం సభ్యులు తెలిపారు. ఎన్ఎంసి చట్టం 34,54 ప్రకారం వీరిపై కేసు నమోదు చేయనున్నారు. ఈ తనిఖీలలో కరీంనగర్ ఆంటీ క్వాకరీ బృందం సభ్యులు హెచ్ ఆర్ డి ఏ సెక్రటరీలు డా. శరణ్ సాయి, సందీప్, భరత్, ఇతర బృందం పాల్గొన్నారు. టీజీఎంసి మెంబర్ డాక్టర్ రాజ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రమంతటా 30 బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నారని తెలిపారు.