ఖాతాదారులకు అన్ని బ్యాంకుల కన్నా సుధా బ్యాంకు నుండి మెరుగైన సేవలు
వాణిజ్య ,వ్యాపార, వ్యవసాయ, ఉపాధి రంగాలకు బ్యాంకు నుండి రుణాలు
రిజర్వ్ బ్యాంకు ,రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు ఉన్న ఏకైక బ్యాంకు సుధా బ్యాంకు.
చైర్మన్ మీలా మహదేవ్, ఎండి పెద్దిరెడ్డి గణేష్
సిరా న్యూస్,సూర్యాపేట;
ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడమే సుధా కోపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ లక్ష్యమని బ్యాంకు చైర్మన్ మీలా మహదేవ్ బ్యాంకు ఎండి పెద్దిరెడ్డి గణేష్ లు అన్నారు. బుధవారం కోదాడ పట్టణంలోని వైష్ణవి ఫంక్షన్ హాల్ లో సుధా కోపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఖాతాదారుల ఆత్మీయ సమ్మేళనంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు, రాష్ట్రవ్యాప్తంగా శాఖలు కలిగి గత 24 సంవత్సరాలుగా అన్ని బ్యాంకుల కంటే దీటుగా ఖాతాదారులకు సేవలందిస్తున్న బ్యాంకు సుధా బ్యాంక్ అన్నారు. వ్యాపార వాణిజ్య రంగాలకే కాకుండా వ్యవసాయ ఉపాధి రంగాలకు కుటీర పరిశ్రమలకు తక్కువ వడ్డీతో రుణాలు అందిస్తున్నామన్నారు. రిజర్వ్ బ్యాంకు తోపాటు రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు ఉన్న ఏకైక బ్యాంకు సుధా కోపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ అన్నారు. రాబోయే రోజుల్లో బ్యాంకు ద్వారా ఖాతాదారులకు మరిన్ని సేవలు అందుబాటులోకి తెస్తామన్నారు. ఖాతాదారుల సంక్షేమమే తమ లక్ష్యం అన్నారు ఈ సందర్భంగా నిర్వహించిన క్రీడా పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో బ్యాంక్ వైస్ చైర్మన్ పొనుగోటి నిర్మల డైరెక్టర్లు కక్కిరేణి చంద్రశేఖర్ సభ్యులు ఇరుకుల్లా చెన్నకేశవరావు వెంపటి వెంకటరమణ స్వామి వెంకటేశ్వర్లు ,కీతా వెంకటేశ్వర్లు, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు రావెళ్ల సీతారామయ్య బార్ అసోసియేషన్ అధ్యక్షులు దేవ బత్తిని నాగార్జున, న్యాయ వాది,అక్కిరాజు యశ్వంత్, పబ్బ గీత, కోట కొమ్ముల భాగ్యలక్ష్మి , కోదాడ బ్రాంచ్ మేనేజర్ సిబ్బంది పాల్గొన్నారు.