సిరా న్యూస్, దస్తురాబాద్:
క్షణికావేశానికి నిండు ప్రాణం బలి…
– తల్లి మందలించిందని యువతి ఆత్మహత్య..
నేటి సమాజంలో పిల్లలు చిన్న చిన్న విషయాలకి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. నిండు నూరేళ్లు జీవించాల్సిన చిన్నారులు మధ్యలోనే తనువు చాలిస్తున్నారు. దస్తురాబాద్ మండలం దేవునిగూడా గ్రామపంచాయతి కి చెందిన సాత్విక (23) అనే యువతి తల్లి మందలించిందని క్షణికావేశానికి లోనై పురుగుల మందు తాగింది. దీంతో ఆమెను హుటాహుటిన జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. దీనిపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్లు ఎస్సై ప్రభాకర్ రెడ్డి తెలిపారు