సిరా న్యూస్, చిగురుమామిడి:
ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య…
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఓబులాపుర్ గ్రామానికి చెందిన బోయిని మల్లయ్య (65) ఆదివారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్ కి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు చిగురుమామిడి ఎస్ఐ బండి రాజేష్ తెలిపారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం… మల్లయ్య గత నాలుగు నెలల నుండి మతి స్థిమితం సరిగ్గా లేక, అనారోగ్యం తో బాధపడుతున్నాడు. పలు హాస్పిటల్లో చికిత్స అందించినప్పటికీ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోవడంతో, జీవితం పై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. మల్లయ్య కుమారుడు బోయిని కిరణ్ ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.