సిరాన్యూస్, ఓదెల
నిర్మాణ దశలో ఉన్న సుల్తానాబాద్ బస్టాండ్.. అవస్థలు పడుతున్న ప్రయాణికులు
గత కొద్ది రోజుల నుండి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ బస్టాండ్ రి నిర్మాణం లో ఉంది. నిలబడడానికి సైతం నీడ లేక పోవడంతో ప్రయాణికులు చెట్ల కింద నిలబడుతున్నారు. బస్టాండ్ పూర్తి కాకపోవడంతో ప్రయాణికులు నిత్యం నానా అవస్థలకు గురవు తున్నారు. అసలే వర్షాకాలం నిలువ నీడలేని ప్రయాణికులకు చెట్లే ఆధారమయ్యాయి. ప్రయాణికుల సౌకర్యార్థం బస్టాండ్ త్వరగా పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.
