సిరాన్యూస్, చిగురుమామిడి
సుందరగిరిలో ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి రథోత్సవం
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామంలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం చివరి రోజు ఘనంగా రథోత్సవం నిర్వహించారు. అనంతరం స్వామి వారిని రథంలో ఊరేగింపు నిర్వహించారు.ఈ రథోత్సవ కార్యక్రమానికి చుట్టుపక్కల ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు, ప్రజా ప్రతినిధులు తరలివచ్చి దర్శించుకున్నారు. స్వామివారి ఆశీస్సులతో సుఖ సంతోషాలతో ఉండాలని భక్తులు కోరుకున్నారు.