సిరాన్యూస్, బజార్‌హత్నూర్
డ్రగ్స్ మహమ్మారిని తరిమేద్దాం: కళాశాల ప్రిన్సిపాల్ కే సునీల్ కుమార్
డ్రగ్స్ మహమ్మారిని తరిమేద్దామని కళాశాల ప్రిన్సిపాల్ కే సునీల్ కుమార్ అన్నారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా బజార్‌హత్నూర్ మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదకద్రవ్యాల నిషేధ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ కే సునీల్ కుమార్ మాట్లాడారు. విద్యార్థుల యొక్క ఉజ్వల భవిష్య కోసము విద్యార్థులు దురాలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. అనంతరం ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ షిండే జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ మత్తు రహిత యువత బలమైన సామాజిక వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. తర్వాత విద్యార్థులు కళాశాల సిబ్బంది మండల హెడ్ క్వార్టర్ లో ర్యాలీగా పోలీస్ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో ఎంపీడీవో, సీఐ, ఎస్ఐ, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ , అధ్యాపకులు, విద్యార్థులు పాల్లొన్నారు.