Sunkidi School: సుంకిడి పాఠశాలలో ఆచార్య జయశంకర్ జయంతి

సిరా న్యూస్, తలమడుగు
సుంకిడి పాఠశాలలో ఆచార్య జయశంకర్ జయంతి

తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల, సుంకిడి లో పాఠశాల సిబ్బంది, విద్యార్థినీ, విద్యార్థులు ఘనంగా నిర్వ‌హించారు. ఈసంద‌ర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ చిత్ర‌ప‌టానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ ఉద్యమంలో ఆచార్య జయశంకర్ అందించిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ స్వామి, ఉపాధ్యాయులు గజానన్, వై.రామ్ రెడ్డి, సుకుమార్ పెట్కులే, సుజాత, నామ్దేవ్, మాజీ ఎంపిటిసి వెంకన్న యాదవ్, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *