డ్రైవర్ అప్రమత్తతో తప్పిన పెను ప్రమాదం
సిరా న్యూస్,కరీంనగర్;
చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలం వెంకటయ్య పల్లి ఇస్లాంపూర్ గ్రామాల మధ్య సూపర్ లగ్జరీ ఆర్టిసి బస్సు వెనక చక్రాల బ్రేక్ లైనర్ల సమస్య వల్ల మంటలు చెలరేగాయి. కోరుట్ల డిపోకు చెందిన బస్సు హైదరాబాద్ వెళ్లి తిరిగి కోరుట్ల కి వెళ్తుండగా ఇస్లాంపూర్ గ్రామం వద్దకు రాగానే వెనక చక్రాలలో పొగలు మంటలు రావడం గమనించిన డ్రైవర్ రవి వెంటనే బస్సును నిలిపివేసాడు. బస్సులోని ప్రయాణికులను అప్రమత్తం చేసి దింపేశారు. బస్సులో ఉన్న మినరల్ వాటర్ బాటిల్లతో మంటలను ఆర్పే ప్రయత్నం చేసారు. నే విషయాన్ని ఫైర్ సిబ్బందికి తెలపడంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని ఆర్పివేశారు. డ్రైవర్ రవి అప్రమత్తత వల్ల ప్రాణాపాయం తప్పిందని ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న కొడిమ్యాల పోలీసులు గంగాధర పోలీస్ స్టేషన్ కి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఆర్టీసీ సిబ్బంది ఘటనా స్థలం నుంచి బస్సును తరలించారు