సిరా న్యూస్, బేల
అమ్మ మాట.. అంగన్వాడీ బాటను విజయవంతం చేయాలి: ఐసీడీఎస్ సూపర్వైజర్ సుజాత
అమ్మ మాట.. అంగన్వాడీ బాటను విజయవంతం చేయాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ సుజాత అన్నారు. ప్రభుత్వం ప్రారంభించిన అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమం మంగళవారం ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలోని ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈసందర్బంగా సూపర్‌వైజర్, అంగన్వాడీ టీచర్లు,ఆయాలు పిల్లలతో కలిసి ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా మండల ఐసీడీఎస్ సూపర్వైజర్ సుజాత మాట్లాడుతూ అంగన్‌వాడీలను బలోపేతం చేసేందుకు కేంద్రాలకు రెండున్నరేళ్లు దాటిన చిన్నారులను చేర్పించేందుకు సోమవారం నుంచి ఈనెల20వరకు సామూహిక అక్షరాభ్యాసం కార్యక్ర మాన్ని ప్రతి అంగన్‌వాడీ సెంటర్‌లో నిర్వహించనున్నామన్నారు.ఈ కార్యక్రమం ద్వారానే అంగన్‌వాడీ కేంద్రాల్లో నమోదైన చిన్నారులకు ఉచితంగా యూనిఫాం కూడా అందించనున్నట్లు పేర్కొ న్నారు.మండలం లోని ప్రతి అంగన్‌వాడీ సెంటర్‌లో చిన్నారుల నమోదు శాతాన్ని పెంచేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు విశాఖ, పద్మ, సునీత, ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.