సిరాన్యూస్, భీమదేవరపల్లి
కరాటే అమ్మాయిలు నేర్చుకోవాలి: ప్రిన్సిపల్ సురేఖ
కరాటే అందరూ అమ్మాయిలు నేర్చుకోవాలని ప్రిన్సిపల్ సురేఖ అన్నారు. తెలంగాణ రాష్ట్ర గురుకుల పాఠశాల లో కరాటే, సెల్ఫ్ డిఫెన్స్ , యోగ ప్రదర్శన సమావేశం నిర్వహించారు. గత రెండు నెలల నుంచి తెలంగాణ ప్రభుత్వం పాఠశాలలో బాలికల కోసం ఆత్మ రక్షణ క్రీడలో శిక్షణ ఇప్పిస్తుంది . కరాటే ,యోగ సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్ కోచ్ రవళి ఆధ్వర్యంలో భీమదేవరపల్లి మండలంలోని పాఠశాలలోని బాలికలకు నేర్పించడం జరిగింది. నేర్చుకున్న విన్యాసాలు విద్యార్థులు చాలా చక్కగా ప్రదర్శించారు. ఈసందర్భంగా ప్రిన్సిపల్ సురేఖ మాట్లాడుతూ కరాటే అందరూ అమ్మాయిలు నేర్చుకోవాలని చెప్పారు. ప్రతి అమ్మాయికి కరాటే వాళ్ళని వాళ్ళు ఇతరుల నుంచి ఆపద సమయం లో కాపాడుకోవటానికి ఉపయోగ పడుతుందని తెలిపారు. ఆత్మ స్థైర్యాన్ని పెంచుతుందని వారు తెలిపారు. అమ్మాయిలు కచ్చితంగా కరాటే నేర్చుకోవాలి అని చెప్పారు.ఈ కార్యక్రమంలో పీఈటీ నిర్మల కోచ్ రవళి ,ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.