సిరాన్యూస్, భీమదేవరపల్లి
బాటసారుల దాహాం తీర్చిన సురేందర్ రెడ్డి
* హుస్నాబాద్ నియోజకవర్గంలో చలివేంద్రాలు ఏర్పాటు
భీమదేవరపల్లి మండలంలోని భీమాదేవరపల్లి, ముల్కనూర్, కొత్తకొండ గ్రామాలలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం తో గ్రామాలలో బీజేపీ నాయకులు జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి చలివేంద్రం ఏర్పాటు చేశారు. కన్నారం గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి ప్రజాసేవలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకొని, వేలమంది అభిమానుల గుండెల్లో నిలిచిపోయాడు. కేవలం ఒక్క చలివేంద్రం ఏర్పాటు మాత్రమే కాదు, మృతుల కుటుంబాలకు బియ్యం వితరణ, పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కల పంపిణి, పోటీ పరీక్షల విద్యార్థులకు పుస్తకాలు, ట్రాక్ షూట్ అందజేత, మరెన్నో అభివృధి కార్యక్రమాలు చేస్తూ ప్రజల మనస్సులో ఆదరణ పొందిన గొప్ప నాయకుడు మన జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి.తనకంటూ ప్రత్యేక స్థానాన్ని కలిపించుకున్నారు.. పార్టీలో అధికారం లేకున్నా ప్రజా ఆదరణ పొందిన గొప్ప నాయకులుగా పేరు సంపాదించుకున్నారు.