సిరా న్యూస్, కళ్యాణదుర్గం
ఏ సమస్య వచ్చినా అండగా ఉంటా
* ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు
* ఈనెల 29న కళ్యాణదుర్గానికి సురేంద్ర బాబు రాక
కార్యకర్తలకు ఏ సమస్య వచ్చినా తాను అండగ ఉంటానని ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తెలిపారు.
ఆయన ఈనెల 29న కళ్యాణదుర్గానికి రానున్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు ఘన స్వాగతం పలికేందుకు టిడిపి శ్రేణులు ఆయన అభిమానులు, నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. గ్రాండ్ ఎంట్రీ తో కళ్యాణదుర్గంలో వచ్చిన అనంతరం ఇక ప్రజల మధ్యనే ఉంటానని అమిలినేని సురేంద్రబాబు తెలిపారు. ఇప్పటికే కళ్యాణదుర్గం పట్టణంలో గరుడాపురం రోడ్డులో కార్యాలయ నిర్మాణ పనులు కూడా, పూర్తి అయ్యే దశకు వచ్చాయి. అమిలినేని ఎంట్రీ తర్వాత ఆయన మొదటి పర్యటన ఏ మండలంలో చేస్తాడో అని కూడా ఇప్పటికే, చర్చలు నడుస్తూ ఉన్నాయి.