Surendra Babu: నిబంధనలు విధించకుండా సంక్షేమ పథకాలు

సిరాన్యూస్‌, కుందుర్పి
నిబంధనలు విధించకుండా సంక్షేమ పథకాలు
* ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు
* కృష్ణాపురంలో రోడ్ షో

అనంతపురం జిల్లా కుందుర్పి మండలం కృష్ణాపురం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు. ఎన్నికల ప్రచారనికి వచ్చిన కళ్యాణదుర్గం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబుకు టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు, మహిళలు, గ్రామస్థులు పూలవర్షం కురిపించి ఘజమాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా అమిలినేని మాట్లాడుతూ ఎలాంటి నిబంధనలు విధించకుండా అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అందిస్తామని చెప్పారు. ఇప్పటికే ఈ చేతకాని ముఖ్యమంత్రి నిబంధనల పేరుతో ఎంతో మందికి అర్హత ఉన్న సంక్షేమ పథకాలు అందకుండా పోయాయని, ఎన్నికల ముందు ఎంతమంది చదువుకుంటే అందరికీ అమ్మ ఒడి అని చెప్పి అధికారంలోకి వచ్చాక ఒకరికే అమ్మ ఒడి ఇచ్చి మోసం చేసాడని, ఇలాంటి ముఖ్యమంత్రిని గద్దె దించి అందరికి సంక్షేమ పథకాలు అందించే చంద్రబాబు నాయుడి ని గెలిపించుకోవాలని, అందుకు ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను గెలిపించాలాని అభ్యర్థించారు.కార్యక్రమంలో నియోజకవర్గ సీనియర్ నాయకులు, కుందుర్పి మండల సీనియర్ తెలుగుదేశం పార్టీ, నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో గ్రామస్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *