సిరా న్యూస్, కళ్యాణదుర్గం
హిందీ నరసప్ప ను ఆదర్శoగా తీసుకుందాం
*టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు
* ఘనంగా హిందీ నరసప్ప వర్ధంతి
స్వాతంత్ర సమరయోధులు, కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే హిందీ నరసప్పను ఆదర్శంగా తీసుకుని ముందుకెళదామని కళ్యాణదుర్గం టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు అన్నారు. హిందీ నరసప్ప 24వ వర్థంతి సందర్భంగా సురేంద్ర బాబు వారి స్వగృహంలో చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళ్యాణదుర్గం నియోజకవర్గం కంబదురు మండలం నూతిమడుగు గ్రామంలో హిందీ నరసప్ప జన్మించారు. ఈయన 1941 జనవరి 24వ తేదీన సత్యాగ్రహానికి మద్దతుగా దీక్ష చేపట్టి జైలుకు వెళ్లడం జరిగింది. నీలం సంజీవరెడ్డి ఆశీస్సులతో 1962-78 మధ్య కాలంలో రెండు సార్లు కళ్యాణదుర్గం నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజలకు సేవచేశారన్నారు.వీరు 2000 సంవత్సరంలో మరణించడం జరిగింది.వీరు ఎంతో నీతి, నిజాయితీ నిరడంబరంగా, విలువలతో కూడిన రాజకీయo చేయడం జరిగిందని. వీరిని ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళదామని, ఈ సందర్భంగా అయన చేసిన సేవలను నెమరువేసుకున్నారు . కార్యక్రమంలో బ్రహ్మసముద్రం టిడిపి నాయకుడు జితేంద్రాగౌడ్, తమ్మినేని పవన్, రామ్మోహన్ తదితరులు ఉన్నారు.