సిరా న్యూస్, కళ్యాణదుర్గం
విద్యా వ్యవస్థ బాగుపడాలంటే చంద్రబాబు సీఎం కావాలి
* ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు
విద్యా వ్యవస్థ బాగుపడాలంటే కచ్చితంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని కళ్యాణదుర్గం పట్టణం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు అన్నారు. సోమవారం నియోజకవర్గంలోని ప్రైవేట్ పాఠశాలల ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులతో సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా సురేంద్ర బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బాగుపడాలంటే కచ్చితంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని, అందుకు కళ్యాణదుర్గం నుంచి పోటీ చేస్తున్న తనకు మద్దతు ఇచ్చి పార్టీ గెలుపుకు కృషి చేయాలని కోరారు.