Surendra Babu: ఆశీర్వదించండి …అభివృద్ది చేస్తా

సిరా న్యూస్,కళ్యాణదుర్గం
ఆశీర్వదించండి …అభివృద్ది చేస్తా
* టీడీపీ ఎంఎల్ ఏ అభ్య‌ర్థి సురేంద్రబాబు
* సూపర్ సిక్స్ పథకాలపై ఇంటింటా ప్ర‌చారం
టిడిపిని గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి బాట పట్టిస్తాన‌ని టీడీపీ ఎంఎల్ ఏ అభ్య‌ర్థి సురేంద్రబాబు అన్నారు. గురువారం నియోజకవర్గంలో తొలిసారిగా క్షేత్రస్థాయి ఎన్నికల ప్రచారం నిర్వ‌హించారు.ఈ ఎన్నికల ప్రచారానికి భారీగా టిడిపి కార్యకర్తలు, నాయకులు, జనసైనికులువందలాది త‌ర‌లివ‌చ్చారు. ముందుగా సురేంద్రబాబుకు గ్రామంలోకి స్వాగతం బాణసంచా కాలుస్తూ, పూల వర్షం కురిపిస్తూ సందడి చేశారు. అనంత‌రం ఆయ‌న ఇంటింటికి వెళ్లి సూపర్ సిక్స్ పథకాలను వివరించారు.గ్రామంలో సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగారు. కార్య‌క్ర‌మంలో టీడీపీ నాయ‌కులు పాల్గొ్న్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *