Surendra Babu: వైసీపీ మేనిఫెస్టోలో బొమ్మలు తప్ప అభివృద్ధి పథకాలు లేవు: ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు

సిరా న్యూస్, కుందుర్పి
వైసీపీ మేనిఫెస్టోలో బొమ్మలు తప్ప అభివృద్ధి పథకాలు లేవు: ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు
జంబగుంపలలో ఎన్నికల రోడ్ షో

వైసీపీ మేనిఫెస్టోలో బొమ్మలు తప్ప అభివృద్ధి పథకాలు లేవని కళ్యాణదుర్గం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు అన్నారు. అనంతపురం జిల్లా కుందుర్పి మండలం జంబగుంపల గ్రామంలో మంగ‌ళవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు. ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు కు టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు, మహిళలు, గ్రామస్థులు పూలవర్షం కురిపించి ఘజమాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా అమిలినేని మాట్లాడుతూ వైసీపీ విడుదల చేసిన మేనిఫెస్టోలో కేవలం జగన్, వైఎస్సార్ బొమ్మలు, ఎంపీ బొమ్మ తప్ప అందులో ఏ ఒక్క సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధికి సంబందించిన ఏ ఒక్కటి అందులో ప్రకటించలేదని, వాళ్ళు ఏమి చేయలేకనే అందులో ఏమి ప్రకటించలేదని ఎద్దెవ చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోతో పాటు నా స్వంత మేనిఫెస్టో కూడా పాంప్లెట్ లో పొందుపరిచామని, వాటిని కచ్చితంగా అమలు చేసి అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. అంతే కాకుండా నేను అభివృద్ధి చేసి మీలో ఒకడిగా ఉండాలని వచ్చా తప్ప అక్రమాలు, స్కామ్ లు చేసి అక్రమంగా సంపాదించాలని రాలేదు ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు రాక, ఉపాధి లేక వలసలు వెళుతున్నారని ,వారి కోసం కచ్చితంగా పరిశ్రమలు తెచ్చి యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు.. కుందుర్పి బ్రాంచ్ కేనాల్ పూర్తి చేసి ఈ ప్రాంతంలోని అన్ని చెరువులకు నీళ్లిచ్చి ప్రజలకు మంచి చేస్తామని, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రోడ్డు నిర్మించి ప్రజలకు ఇబ్బంది లేకుండా, సూపర్ సిక్స్ పథకం ద్వారా ఇంటింటికి కుళాయి వేయించి తాగడానికి నీరు అందించి సమస్య తొలగిస్తా, గ్రామాల్లో సీసీ రోడ్లు నిర్మించి, అలాగే గ్రామంలో ఉన్న సమస్యలు పరిష్కరించి అన్ని రకాలుగా ఆడుకుంటామని భరోసా ఇచ్చారు. ఈనెల‌ 13న ప్రతి ఒక్కరు సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను మంచి మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు.కార్యక్రమంలో నియోజకవర్గ సీనియర్ నాయకులు, కుందుర్పి మండల సీనియర్ తెలుగుదేశం పార్టీ, నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో గ్రామస్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *