సిరాన్యూస్, కళ్యాణదుర్గం
టీడీపీ కార్యకర్త లింగమయ్యకు ఎమ్మెల్యే సురేంద్ర బాబు ఆర్థిక సాయం
కళ్యాణదుర్గం నియోజకవర్గం బ్రహ్మసముద్రం మండల కేంద్రానికి చెందిన టీడీపీ కార్యకర్త హరిజన లింగమయ్య రోడ్డు ప్రమాదంలో గాయపడి అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం తెలుసుకున్న కళ్యాణదుర్గం నియోజకవర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు బ్రహ్మసముద్రం టీడీపీ మండల కన్వీనర్ పాలబండ్ల శ్రీరాములు ద్వారా అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో లింగమయ్య ను పరామర్శించారు. అనంతరం లింగమయ్య కుటుంబ సభ్యులకు రూ.10వేలు ఆర్థిక సాయం అందజేశారు. తదనంతరం టీడీపీ పార్టీ కుటుంబానికి ఏళ్ల వేళల అండగా ఉంటుందన్నారు.