Surendra Babu: చంద్ర‌బాబు నాయుడు చిత్ర‌ప‌టానికి పాలాభిషేకం:  ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు

సిరా న్యూస్, కళ్యాణదుర్గం
చంద్ర‌బాబు నాయుడు చిత్ర‌ప‌టానికి పాలాభిషేకం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు
* నిరుద్యోగులు, పింఛన్ దారులకు టీడీపీ అండ

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణం తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రజావేదికలో డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగులు, నైపుణ్యాభివృద్ధి సంస్థలో శిక్షణ పొందిన అభ్యర్థులు, వికలాంగులు, పింఛన్ దారులతో కలసి కళ్యాణదుర్గం శాసనసభ్యులు అమిలినేని సురేంద్ర బాబు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు మాట్లాడుతూ మన రాష్ట్రం కలలు కన్న రోజులు వచ్చాయని, ఇక నుంచి నిరుద్యోగులు, ఉన్నత చదువులు చదివి సరైన ఉద్యోగాలు రాకుండా ఉన్న వారు అంగవైకల్యంతో బాధపడే వారు, వృద్దులు ఏమాత్రం బాధపడకుండా వారికి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే వారి కోసమే మొదటి ఐదు సంతకాలు చేయడం చాలా గొప్ప విషయమని చెప్పారు. ఎన్నికల ముందు చెప్పిన ప్రకారం డీఎస్సీ పై మొదటి సంతకం చేయడం హర్షనీయమ‌న్నారు. దాదాపు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 16347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేసేందుకు చేసిన సంతకం ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న యువత కండ్ల‌లో ఆనందం కన్పిస్తోందన్నారు. జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో ఎలాంటి ఉద్యోగావకాశాలు లేక నిరుత్సాహంలో ఉన్న యువత ఎన్నికల సమయంలో ముందుకు రావడం చాలా సంతోషకార‌మ‌న్నారు. 53 రోజులు జైలులో పెట్టి హింసించినా బెద‌రకుండ రాష్ట్రం కోసం పని చేసి చంద్రబాబు నాయుడు ఇంతటి గొప్ప విజయాన్ని అందుకున్నారని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *