సిరా న్యూస్, కళ్యాణదుర్గం
గుంతలరోడ్లకు మహర్దశ
* సొంత ఖర్చుతో రోడ్డు నిర్మాణం వేయిస్తున్నసురేంద్రబాబు
* హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు
నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్న గుంతల రోడ్ల మరమ్మతులకు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు శ్రీకారం చుట్టారు. నియోజకవర్గంలో ఆయా గ్రామాలకు 30నుండి 40జేసీబీలను పంపించే ఆలోచనలో అమిలినేని సురేంద్ర బాబు బృందం ఉన్నారు.ఇందుకు సంబందించిన పనులను ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలకు అప్పగించినట్లు సమాచారం. ఈపనులను ఎన్నికల కోడ్ వచ్చే లోపు రోడ్ల మరమ్మత్తుల పనులు పూర్తి చేసేలా యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు.ఇప్పటికే నియోజకవర్గం లో కళ్యాణదుర్గం మండలం నుసికొట్టాల తండా, శెట్టూరు మండలం కైరేవు గ్రామంలో, బ్రహ్మాసముద్రం మండలం రాయలప్ప దొడ్డి, బొమ్మగానిపల్లి గ్రామాలలో రోడ్డు పనులు చేశారు.కళ్యాణదుర్గం నియోజకవర్గం లో గుంతల రోడ్ల తో వాహన రాక పోకలతో ఇబ్బందులు పడుతున్న ప్రజల కష్టాలను తీరుస్తున్నాడు.ఎన్నికల కోడ్ వచ్చే లోపు రోడ్ల మరమ్మత్తులు చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. నియోజకవర్గం వ్యాప్తంగా మరమ్మత్తులకు నోచుకోని రోడ్లను మరమ్మత్తులు చేస్తున్నట్లు విశ్వాసనీయ వర్గాల సమాచారం. ఆయన సొంత ఖర్చుతో రోడ్డు నిర్మాణాలు చేపట్టడం వల్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.