Suresh Reddy:  శ్మ‌శానవాటికను ధ్వంసం చేసిన వారిని శిక్షించాలి :  బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గొట్టిముక్కుల సురేష్ రెడ్డి

సిరాన్యూస్‌, ఓదెల‌
 శ్మ‌శానవాటికను ధ్వంసం చేసిన వారిని శిక్షించాలి :  బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గొట్టిముక్కుల సురేష్ రెడ్డి

హిందూ శ్మ‌శానవాటికను ధ్వంసం చేసిన వారిని శిక్షించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గొట్టిముక్కుల సురేష్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల గ్రామంలో ఈనెల 19న గుర్తుతెలియని వ్యక్తులు జేసీబీ సహాయంతో హిందూ స్మశానవాటిక కూలగొట్టడం జరిగింద‌ని, వారిని శిక్షించాలని బీజేపీ నాయకులు తాళ్లపల్లి వెంకటేష్, నిరంజన్ చేస్తున్న నిరసన దీక్షకు గురువారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గొట్టిముక్కుల సురేష్ రెడ్డి మ‌ద్ద‌తు తెలిపారు.ఈసందర్భంగా సురేష్ రెడ్డి మాట్లాడుతూ గుంపుల గ్రామంలో పురాతన కాలం నుంచి గ్రామస్తులు దహన సంస్కారాలు నిర్వహిస్తున్న ప్రభుత్వ స్థలంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించిన స్మశానవాటికని కొందరు వ్యక్తులు అర్ధరాత్రి పూట ప్రభుత్వ భూమిలోకి అక్రమంగా చొరబడి ప్రభుత్వ ఆస్తి అయిన స్మశానవాటికని ధ్వంసం చేశార‌ని తెలిపారు. ఈ ఘ‌ట‌న జ‌రిగి వారం రోజులు గడుస్తున్నా స్థానిక అధికారులు, పోలీసులు అధికార పార్టీకి కొమ్ముకాస్తూ ఈఘటనలో పాల్గొన్న వారిపై ఎలాంటి చర్యల చేపట్టడం లేదని తెలిపారు, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన వారిని అధికారులు ఎందుకు వెనుకేసుకొస్తున్నారో అర్థం కావడంలేదని ఆరోపించారు. ఇకనైనా సంబంధింత అధికారులు స్పందించి దోషులపై చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో భారతీయ జనతా పార్టీ పక్షాన పోరాటం చేసి గ్రామానికి న్యాయం చేసే వరకు పోరాటం చేస్తామ‌ని తెలిపారు. కార్యక్రమంలో హిందూ వాహిని పెద్దపల్లి జిల్లా సహా కార్యవహా ఉయ్యంకర్ సాయి, చిరంజీవి సకినాల కృష్ణ, నిరంజన్, మల్లేశం ,శ్యామ్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *