సిరా న్యూస్,విశాఖపట్నం;
విశాఖ పోలీసుల ఎదుట ఆరుగురు మావో యిస్టులు లొంగిపో యారు. చత్తీస్గడ్ డివిజనల్ కమిటీ సభ్యుడు ఖుర్రం మిధిలేష్, అదే రాష్ట్రానికి చెందిన కిస్తారం ఏరియా కమిటీ సభ్యులు వెట్టి భీమ పోలీసులకు లొంగిపోయారు. దండకారణ్య ప్రత్యేక జోనల్ కమిటీ సభ్యురాలు వంజం రమే, వి.మదకం సుక్కి, దూది సోని, పార్యలు పోలీసుల ఎదుట లొంగి పోయారు.పోలీసులు ఎదుట లొంగిపోయిన ఆరుగురు మావోయిస్టులపై పలు నేరాలు నమోదు అయ్యాయని విశాఖ రేంజి డీఐజీ విశాల్ గున్ని పేర్కొన్నారు. వీరిని పట్టించిన వారికి లక్ష నుంచి అయిదు లక్షల రూపాయ ల వరకు రివార్డు ఉందని ఆయన వెల్లడించారు. చాలా కాలంగా పోలీసులకు వ్యతిరేకంగా మావోయిస్టులు చేపట్టిన అనేక విధ్వంసకర చర్యల్లో పాల్గొన్నారని పేర్కొన్నారు. మారిపోయిన మావోయిస్టులకు ప్రభు త్వం అందిస్తున్న ప్రతిఫ లాలను దృష్టిలో ఉంచుకొని పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు విశాల్ గున్ని తెలిపారు. ఇంకా అడవులలో ఉంటున్న మావోయిస్టు లు పోలీసుల ఎదుట లొంగిపోతే ప్రభుత్వం నుంచి రావల సిన అన్ని ప్రతిఫలాలు అందిస్తామని ఈ సందర్భంగా అధికారులు వెల్లడించారు.