సిరా న్యూస్,సిరిసిల్ల;
రాజన్న సిరిసిల్ల జిల్లా. బోయిన్ పల్లి మండలం మాన్వాడ వద్ద మిడ్ మానేర్ నిర్మించిన రాజరాజేశ్వర జలాశయం నుండి దిగువకు నీళ్లు వదలడంతో మిడ్ మానేరులో మునిగిపోయిన గ్రామాలు బయటపడుతున్నాయి. తాము నివసించిన ఇళ్లను చూడడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఈ జలాశయం కింద 11 గ్రామాలు పూర్తిగా, మరో 8 గ్రామాలు పాక్షికంగా మునిగిపోయాయి. కొదురుపాక, నీలోజిపల్లి, అనుపురం, కొడుముంజ తదితర గ్రామాల్లో ఇల్లు, వాటర్ ట్యాంకులు, దేవాలయాలు తేల్తున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా తమకు ఆయా గ్రామంతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. రెండేళ్ల క్రితం సైతం మిడ్ మానేరులో నీరును దిగువకు వదలడంతో ఇలాగే గ్రామాలు బయటపడ్డాయి. ఈసారి సైతం తమ ఇల్లు చూసుకోవడానికి గ్రామస్తులు ఉత్సాహం చూపుతున్నారు.
===================