చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్బడిన ముగ్గురు రెవెన్యూ అధికారులు సస్పెండ్
అన్ని రెవెన్యూ కార్యాలయాల వద్ద నైట్ వాచ్ మెన్ తప్పనిసరి
నిబంధనలకు వ్యతిరేకంగా పని చేస్తే కఠిన చర్యలు తప్పవు
జిల్లా కలెక్టర్ శివ శంకర్ లోతేటి
సిరా న్యూస్,గన్నవరం;
28ఢిల్లీ బయలుదేరిన వైకాపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
వైకాపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. కాసేపట్లో వైసీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కలిసి ఎయిర్ ఇండియా విమానంలో ఢిల్లీ వెళ్లారు.
ఏపీలో జరుగుతున్న హింసాకాండకు నిరసనగా జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఢిల్లీలో ధర్నా చేయనున్నారు.
శివ శంకర్ లోతేటి సస్పెండ్ చేశారు. బద్వేలు రెవెన్యూ డివిజన్, బి.కోడూరుమండలం మున్నెల్లి రెవెన్యూ గ్రామం సర్వే నెంబర్ 755 లో 4.27 ఎకరాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు(1985) చెందిన స్థలాన్ని బి.కోడూరు డిప్యూటీ తహశీల్దార్ (ఎఫ్ ఏ సి)జి.విద్యాసాగర్,(28.10.2023), గ్రామ సర్వేయర్ ఏ.ప్రవీణ్ కుమార్, వీఆర్వో జే. గురవయ్య ముగ్గురు కలసి రికార్డులను వెరిఫై చేయకుండా, ప్రాథమిక విచారణ చేయకుండా దురు ద్దేశ్యంతో, నిబంధనలకు వ్యతిరేకం గా కొండావెంకటసుబ్బమ్మకు మ్యుటేషన్ చేశారు. దీంతో కొండా వెంకట సుబ్బమ్మ 14.2.2024 లో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్)లోమార్టిగేజ్ చేసి రూ.8లక్షల రుణంకూడా తీసుకుంది. ఈమొత్తం వ్యవహారంపై బద్వేల్ ఇంచార్జిఆర్డీవో చంద్రమోహన్ ను విచారణ అధికారి గా నియమించి నివేదికను తెప్పించు కున్న జిల్లా కలెక్టర్ శివ శంకర్ ముగ్గురు రెవెన్యూ అధికారులను తక్షణమే సస్పెండ్ చేశారు. అంతే కాక వీరిపై క్రమశిక్షణా చర్యల్లో భాగంగా చార్జెస్ ను కూడా ఫ్రేమ్ చేశారు. ఇక మీదట ఏ అధికారి అయినా చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడిన, నిబంధనలకు వ్యతిరేకంగా చేసిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
అన్ని రెవెన్యూ కార్యాలయాలకు నైట్ వాచ్ మెన్ తప్పనిసరి
ఆర్డీవో,తహశీల్దార్,అన్ని రెవెన్యూ కార్యాలయాలకు నైట్,వాచ్మెన్ లను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవా లని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ శివ శంకర్ లోతేటి ఆదేశిం చారు.