వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు

 సిరా న్యూస్,విజయవాడ;
వైఎస్ఆర్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగ సంఘం నేతలు కూడా వైసీపీకి మద్దతుగా ప్రకటనలు చేశారు. సచివాలయ ఉద్యోగ సంఘం నేత వెంకట్రామిరెడ్డి ఒక అడుగు ముందుక వేసి వైసీపీ కోసం ప్రచారం చేశారు. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా ఆయన అదే పని చేయడంతో ఎన్నికల సంఘం ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. అప్పట్నుంచి ఆయన సస్పెన్షన్ లోనే ఉన్నారు. తాజాగా ఆయన అధ్యక్షుడిగా ఉన్న ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని ప్రభుత్వం ఆ సంఘానికి నోటీసులు జారీ చేసింది.వెంకట్రామిరెడ్డి తమ సంఘం అధ్యక్షుడే అయినా ఆయన వ్యక్తిగత హోదాలోలోనే ఎన్నికల ప్రచారం చేశారని ఆయన ప్రచారానికి తమ సంఘానికి సంబంధం లేదని కార్యవర్గంలోని ఇతర సభ్యులు ప్రభుత్వానికి వివరణ ఇచ్చారు. అదే సమయంలో కార్యవర్గంలోని కొంత మంది రాజీనామా చేశారు. ప్రభుత్వం ఈ సంఘానికి గుర్తింపు రద్దు చేస్తే ఇక ఎన్నికలు ఉండవు. వైసీప అధికారంలోకి వచ్చిన తర్వాత వెంకట్రామిరెడ్డి ఈ అసోసియేషన్ అధ్యక్షుడిగా అయ్యారు. వైఎస్ జగన్ సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. నేరుగా క్యాంప్ ఆఫీస్‌కు వెళ్లగలరు. ఆయన సిఫారసులతో చాలా మంది అనర్హులకు ప్రమోషన్లు వచ్చాయన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే ఎన్నికల సమయంలో ఆయన కడపకు వెళ్లి ఆర్టీసీ సంఘాలతో సమావేశమయ్యారు. మరికొంత మంది ఉద్యోగులతో కలిసి .. ఎన్నికల ప్రచారం చేశారు. ఎన్నికల్లో మళ్లీ వైసీపీని గెలిపించాలని కోరారు. ఈ వీడియోలు వైరల్ కావడంతో వెంకట్రామిరెడ్డిని అప్పుడే సస్పెండ్ చేశారు. అప్పట్నుంచి ఆయన హెడ్ క్వార్టర్స్ లోనే ఉండాల్సి ఉంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పదిహేను రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు.ఆ నోటీసులకకు వెంకట్రామిరెడ్డి వివరణ ఇవ్వలేదు. వివరణ ఇచ్చేందుకు ఆయనకు కొన్ని అవకాశాలు ఇచ్చి తదుపరి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. సస్పెన్షన్ లో ఉన్న ఆయన గతంలోనూ వివాదాస్పద ప్రవర్తనతో షోకాజ్ నోటీసులు అందుకున్నారు. సస్పెండ్ కూడా అయ్యారు. ఈ క్రమంలో ఆయన సర్వీస్ రూల్స్ పూర్తి స్థాయిలో ఉల్లంఘించిన ఉద్యోగం నుంచి ఉద్వాసన పలకాలని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ఆయన పూర్తిగా ఓ రాజకీయ పార్టీకి తొత్తుగా మారినందున.. అధికార రహస్యాలను రహస్యంగా ఉంచే అవకాశం లేదని.. పలుమార్లు తీవ్రమైన తప్పులు చేసినందన ఆయనను.. ఉద్యోగం నుంచి తొలగించే అవకాశం ఉన్నట్లుగా అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకుంటున్నట్లుగా చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *