సిరా న్యూస్,గన్నవరం;
ఉంగుటూరు మండలం ఆత్కూరు వైఎస్ఆర్ కాలనీలో వివాహిత అనుమానస్పద మృతి చెందింది. ఎవరూ లేని సమయంలో ఇంట్లో ఫ్యాన్ కి ఉరివేసుకున్నట్టు కుటుంబీకులు చెబుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పెదపాడు మండలానికి చెందిన కత్తి ప్రియాంక (30)కు ఆత్కూరు గ్రామానికి చెందిన కత్తి వెంకటేశ్వరరావు ఆరు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది.వారికి ఇద్దరు మగ పిల్లలువున్నారు. అత్తా మామ భర్త కావాలని ఉద్దేశ పూర్వకంతో మా అమ్మాయిని కొట్టి చంపి ఉరివేసారని ప్రియాంక తల్లిదండ్రులు బంధువులు ఆందోళనకు దిగారు. మృతురాలి భర్త కత్తి వెంకటేశ్వరరావు పోలీసుల అదుపులో వున్నాడు.