సిరా న్యూస్,కాకినాడ;
కాకినాడ రూరల్ ఎల్బీ B నగర్ లో ఉన్న రాజేశ్వరీ రెసిడెన్సీ లో కుక్కల చరణ్ తేజ్ అనే 13 సంవత్సరాల బాలుడు అనుమానాస్పద మృతి చెందాడు. బాలుడు రాజేశ్వరీ రెసిడెన్సీ కు కొద్ది దూరంలో నివాసం ఉంటున్న ఆటోడ్రైవర్ మళ్ళేశ్వరరావు సత్యదేవి దంపతుల కుమారుడు.తమ కొడుకుని ఎవరో కావాలని అపార్ట్మెంట్ పై నుండి క్రిందికి తోసి చంపెసారని బాలుడి తల్లితండ్రులు ఆరో్పిస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న కాకినాడ డిఎస్పీ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.