సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణ రాష్ట్ర మూడవ ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసారు. రేవంత్ రెడ్డి చే రాష్ట్ర గవర్నర్ తమిళ సై ప్రమాణ స్వీకారం చేయించారు.‘‘ ఎనుముల రేవంత్ రెడ్డి అనే నేను. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియ వచ్చిన విషయాన్ని, నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకే తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికీ లేదా వ్యక్తులకు తెలియపరచను లేదా వెల్లడించనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను’’ అని రేవంత్ రెడ్డి ప్రమాణం చేశారు. అనంతరం ప్రమాణస్వీకార పత్రంపై సంతకం చేశారు.