సిరాన్యూస్, కాల్వ శ్రీరాంపూర్
కాల్వ శ్రీరాంపూర్ టైలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా గూట్ల శ్రీహరి
పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో మంగళవారం టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన అధ్యక్షుడి ఎన్నిక నిర్వహించారు.ఇందులో భాగంగా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రానికి చెందిన గూట్ల శ్రీహరిని అధ్యక్షుడిగా, వొడ్నాల రమేష్ ని క్యాషియర్ గా టైలర్స్ అసోసియేషన్ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్బంగా శ్రీహరి మాట్లాడుతూ నాపై ఉన్న నమ్మకంతో నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు నేను సక్రమంగా నిధులు నిర్వహిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో టైలర్స్ అసోసియేషన్ సభ్యులు వొడ్నాల రాజయ్య, రాగుల శ్రీనివాస్, గోలి శ్రీరంగం , గోలి రంగయ్య, సోమ రాజయ్య, సోమ రవి, తిప్పనవేన కొమురయ్య, పాషికంటి రవీందర్, కోరే కుమార్, ఉమ్మాల సదయ్య తదితరులు పాల్గొన్నారు.