సిరా న్యూస్, కుందుర్పి
ప్రజలందరూ ఆయురార్యోగాలతో ఉండాలి
*ఎంపీ తలారి రంగయ్య
* శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎంపీ
*ఘనంగా జాతర మహోత్సవం
ప్రజలందరూ ఆయురార్యోగాలతో ఉండాలని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని వేడుకున్నట్లు అనంతపురం పార్లమెంట్ సభ్యులు కళ్యాణదుర్గం నియోజకవర్గం సమన్వయకర్త, డాక్టర్, తలారి రంగయ్య చెప్పారు. బుధవారం కుందుర్పిమండల కేంద్రంలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి రథోత్సవం సంధర్బంగా స్వామి వారిని దర్శించుకొని, తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు.
అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త, శ్రీ సత్యనారాయణ శాస్త్రి, గ్రామ సర్పంచ్ మారుతీశ్వరి రామ్మూర్తి, జడ్పిటిసి, రాధాస్వామి ఎంపీపీ కమలమ్మ నాగరాజు, వైస్ ఎంపీపీలు , భీమ్ రెడ్డి,శ్రీ లక్ష్మి అజయ్ బాబు, వై యస్ ఆర్, కాంగ్రెస్ పార్టీసీనియర్ నాయకులు, యస్. కె.సుదర్శన్ రెడ్డి,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, బోయ. తిప్పేస్వామి దిశా ఫౌండేషన్ చైర్మన్, చందన శివాజీ, కురుబ సంఘం రాష్ట్ర కార్యదర్శి, దొణ స్వామి, వివిధ గ్రామ, సర్పంచులు, ఎంపీటీసీలు, కో -ఆఫషన్ సభ్యులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు, భక్తులు పాల్గొన్నారు.