Talla Naresh: ధర్మసమాజ్ పార్టీ ప్రతిపాదిస్తున్న నమూనా చిహ్నాన్ని ఆమోదించాలి

సిరాన్యూస్,కరీంనగర్
ధర్మసమాజ్ పార్టీ ప్రతిపాదిస్తున్న నమూనా చిహ్నాన్ని ఆమోదించాలి
* కరీంనగర్ జిల్లా ధర్మ సమాజ్ పార్టీ ప్రధాన కార్యదర్శి తల్లా నరేష్
* కలెక్టర్‌కు విన‌తి ప‌త్రం అందజేత

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ చిహ్నా మారుస్తూ ఆ స్థానంలో కొత్త చిహ్నాన్ని తీసుకురావాలని వివిధ పార్టీల నుండి ప్రతిపాదనలు స్వీకరిస్తున్నా తరుణంలో ధర్మ సమాజ్ పార్టీ ప్రతిపాదిస్తున్న చిహ్నాన్ని ఆమోదించాలని సోమ‌వారం కరీంనగర్ జిల్లా ధర్మ సమాజ్ పార్టీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేస్తూ జిల్లా కలెక్టర్ ప్రమీల సత్పతి కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా ధర్మ సమాజ పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్ళ నరేష్ మాట్లాడుతూ ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన ఉస్మానియా యూనివర్సిటీ, ఉస్మానియా నుండి డాక్టర్ తీసుకున్న డాక్టర్ అంబేద్కర్ చిహ్నం, అగ్రకుల భూస్వామ్య పాలకవర్గంపై అణగారిన వర్గాల రాజ్యం కోసం, హక్కుల కోసం యుద్ధం చేసిన పండగ సాయన్న, సర్వాయి పాపన్న, సమ్మక్క సారలక్కల చిత్రాలను తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదన చిహ్నంలో ఉంచామని తెలిపారు. ఈ చిత్రాలను ఆమోదించాలని డిమాండ్ చేశారు. ఈ చిత్రాల్లో సమాజంలో సమానత్వ భావన పీడిత వర్గాల యోధుల పోరాట స్ఫూర్తి కనిపిస్తుందని భావితరాల తెలంగాణ ప్రజలకు స్ఫూర్తి అవుతుందని, తెలంగాణ వైభోఓ పేతమైన సాంస్కృతిక వారసత్వానికి ప్రతికని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి ఆరేళ్ళ బాబు, రాజేంద్ర ప్రసాద్, నాగరాజు, సురేష్, నవీన్,రామస్వామి భూపతి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *