Talla Naresh: పోరాటయోధుల స్ఫూర్తిని చాటేలా రాష్ట్ర చిహ్నాన్ని రూపొందించాలి

సిరాన్యూస్, చిగురుమామిడి
పోరాటయోధుల స్ఫూర్తిని చాటేలా రాష్ట్ర చిహ్నాన్ని రూపొందించాలి
* ధర్మ సమాజ్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తల్లా నరేష్

పీడిత వర్గాల యోధుల పోరాట స్ఫూర్తి ప్రతిబింబించేలా రాష్ట్ర ప్రభుత్వ చిహ్నాన్ని రూపొందించాలని ధర్మ సమాజ్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తల్లా నరేష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ధర్మ సమాజ్ పార్టీ నమూనా చిత్రం ప్రతిపాదన చేస్తూ బుధవారం చిగురుమామిడి డిప్యూటీ తహసీల్దార్ పార్థసారథికి వినతిపత్రం అందజేశారు. ఈసంద‌ర్బంగా వారు మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, ఉస్మానియా యూనివర్సిటీ, సర్వాయి పాపన్న గౌడ్, పండగ సాయన్న,సమ్మక్క సారలక్క ల చిత్రాలను రాష్ట్ర ప్రభుత్వ లోగోలో ఉంచాలని విజ్ఞాపన పత్రంలో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 93 శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీల పోరాటయోధుల స్ఫూర్తిని చాటేలా రాష్ట్ర చిహ్నాన్ని రూపొందించాలని దానికి విరుద్ధంగా రూపొందిస్తే ఊరుకునేది లేదని అన్నారు. వారి పోరాట స్ఫూర్తి తెలంగాణ భావితరాలకు అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందన్నారు. నమూనా చిత్రాన్ని ఆమోదించేంత వరకు ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో పోరాటాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మండల ప్రచార కమిటీ సభ్యులు జిల్లాల నవీన్, సురేష్, రాజ్ కుమార్ గణేష్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *