కుళ్లిపోయిన ఆహార పదార్ధాల స్వాధీనం
సిరా న్యూస్,హైదరాబాద్;
హైదరాబాద్ లో వర్కింగ్ మెన్, ఉమెన్స్ హాస్టల్స్ లో టాస్క్ఫోర్స్ దాడులు నిర్వహించింది. హాస్టళ్లలోని కిచెన్స్లో దారుణ పరిస్థితులను గుర్తించారు. కాలం చెల్లిన ఆహార వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. పాడైపోయిన వస్తువులతో ఆహారాన్ని తయారుచేస్తున్నట్లు నిర్దారించారు. కిచెన్లో బల్లులు, బొద్దింకలు తిరుగుతున్నట్లు గుర్తించారు. మాదాపూర్, ఎస్సార్ నగర్, కూకట్పల్లి హాస్టళ్లలో సోదాలు చేసారు. హాస్టళ్ల నిర్వాహకులకు నోటీసులు ఇచ్చారు.