సిరా న్యూస్, బేల:
బేలలో టాస్క్ఫోర్స్ దాడులు
+ అక్రమ కలప పట్టివేత
ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలో శనివారం టాస్క్ఫోర్స్ దాడులు కలకలం రేపాయి. ఎఫ్ఆర్వో అహ్మద్ వాహాబ్ ఆధ్వర్యంలో అధికారులు మండల కేంద్రంలో నిర్వహించిన దాడుల్లో నివల్కర్ మహాదేవ్ అనే వడ్రంగి ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచి కలప లభించింది. లభించిన కలప ఖరీదు సుమారు రూ. 28వేల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ మేరకు కలప సీజ్ చేసి, మహాదేవ్పై కేసు నమోదు చేసినట్లు ఎఫ్ఆర్వో తెలిపారు.