సిరా న్యూస్, కళ్యాణదుర్గం
ఇంటింటా టీడీపీ పథకాల ప్రచారంపై సమావేశం
కళ్యాణదుర్గం పట్టణంలోని కుందుర్పి రోడ్డు వైపు ఉన్న ప్రజా వేదిక వద్ద చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలను ప్రతి ఇంటింటికి వివరించే కార్యక్రమంలో భాగంగా మండల కమిటీ సమావేశం నిర్వహిస్తున్నట్లు మండల పార్టీ అధ్యక్షులు గోళ్ళ వెంకటేశులు తెలిపారు..ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు టీడీపీ సీనియర్ నాయకులు పాల్గొంటారు. కళ్యాణదుర్గం మండలంలోని అన్ని పంచాయతీల గ్రామ కమిటి అధ్యక్షులు, పార్టీ బూత్ కన్వీనర్లు, ఏరియా కోఆర్డినేటర్స్, క్లస్టర్ ఇన్చార్జిలు, ప్రధాన కార్యదర్శి, తాజా, మాజీ సర్పంచులు, తాజా, మాజీ ఎంపిటిసిలు, మాజీ సింగల్ విండో డైరెక్టర్స్, అధ్యక్షులు, మాజీ ఎంపిపిలు, పార్టీ వివిధ హోదాలలో ఉన్న నాయకులు, కార్యకర్తలు, సీనియర్ నాయకులు, నియోజకవర్గ, రాష్ట్రస్థాయి నాయకులు అందరూ బాధ్యతగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరారు.