సిరాన్యూస్, కుందుర్పి
ఎమ్మెల్యే అభ్యర్థి అమీలినేని సురేంద్రబాబును గెలిపించాలి
* ప్రతి గ్రామంలో సూపర్ సిక్స్ పథకాలపై ప్రచారం
ఎమ్మెల్యే అభ్యర్థి అమీలినేని సురేంద్రబాబును గెలిపించాలని ఆయన కూతురు కోరారు. శుక్రవారం కుందుర్పి గ్రామంలో ఆమె తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగు యువత నాయకులతో కలిసి సూపర్ సిక్స్ పథకాలు వివరిస్తూ డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహించారు. ప్రతి గ్రామానికి తిరుగుతూ సూపర్ సిక్స్ పథకాలు ప్రతి ఇంటికి వివరిసూ్త గ్రామ అభివృద్ధి కావాలంటే చంద్రబాబు నాయుడిని గెలిపించాలని కోరారు. ప్రతి గ్రామానికి మంచినీరు పథకం అందిస్తామని తెలిపారు.మీకు ఏ సమస్య వచ్చినా నేను అండగా ఉంటాను అని చెప్పారు. ఈసందర్భంగా అందరికీ పలకరిస్తూ తప్పకుండా అందరూ కలిసి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించాలని కోరారు.