బంటుమిల్లిలో టీడీపీ ప్రచారం

సిరా న్యూస్,పెడన నియోజవర్గం;
ఉమ్మడి శాసనసభ అభ్యర్థి కాగిత కృష్ణ ప్రసాద్ సతీమణి కాగిత శిరీష ఆధ్వర్యంలో గురువారం బంటుమిల్లి మండలం మోడీ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా గడపగడప సందర్శిస్తూ చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ కార్యకర్తలను ముందుకు సాగారు.
ఈ సందర్భంగా కాగిత శిరీష మాట్లాడుతూ ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తెలుగుదేశం ప్రభుత్వం వైపే వున్నారని అన్నారు. మా ప్రయాణం అని చెప్పడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలు పేద ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని స్వయంగా ప్రజలే చెప్పడం ఆనందనీయం. ఎస్టి, ఎస్సీ, బీసీ మైనార్టీ మహిళలకు 50 సo దాటిన వ్యక్తులకు పెన్షన్ వెసులుబాటు కల్పించడం, వల్ల ప్రజల్లో ఉత్సాహం మరింత రెట్టింపు అయిందని శిరీష పేర్కొన్నారు కచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని పెడన నియోజకవర్గం కృష్ణప్రసాద్ మరియు పార్లమెంట్ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి భారీ మెజారిటీతో గెలుపొందుతారని శిరీష ఆశ భావం వ్యక్తపరిచారు.
ఈ కార్యక్రమంలో మోడీ గ్రామస్తులు బంటుమిల్లి మండల స్థాయి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *