సిరా న్యూస్,రాయచోటి;
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రాంప్రసాద్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. చిన్నమండెం.మండలం బోడి రెడ్డి గారి పల్లెలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రాంప్రసాద్ రెడ్డి తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నిన్న జరిగిన వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు వండాడి వెంకటేశ్వర్లు ఇంటి పై దాడి చేసిన ఘటనలో తెలుగుదేశం పార్టీ నాయకులకు ఎటువంటి సంబంధం లేదని వైఎస్ఆర్సిపి పార్టీ ఓటమి భయంతోనే జరిగిన ఎలక్షన్ బూతులు వద్ద వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు వండాడి వెంకటేశ్వర్లతో కలసి దౌర్జన్యాలకు పాల్పడ్డారని. వండాడి వెంకటేశ్వర్లు ఒక భూకబ్జాదారుడని. బిసి వర్గాలకు చెందిన పేదవారు భూములను దౌర్జన్యంతో కబ్జా చేశారని. ఆ భూములు పోగొట్టుకున్న వారే ఉండాడి వెంకటేశ్వర్లు ఇంటిపై దాడి చేశారని రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఎన్నికల ఫలితాలలో రాయచోటిలో గొప్పమెజారిటీతో గెలుస్తుందని అన్నారు.ఓటమి భయంతోనే రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఈ దాడులు చేయిస్తున్నారని రాంప్రసాద్ రెడ్డి మీడియా సమావేశంలో అన్నారు…
==================