సిరా న్యూస్,పిఠాపురం;
చంద్రబాబునాయుడు ప్రభుత్వంలో రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లను ఏర్పాటుచేసి పేదలందరికీ కడుపునింపితే తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు తొలగించివేసి పేదల కడుపు కొట్టాడని,అయినాసరే చంద్రబాబునాయుడు ఆదేశాలమేరకు నాలుగున్నరేళ్ళుగా పిఠాపురంలో వర్మాస్ కావ్య ఫౌండేషన్ ద్వారా తాను పేదల ఆకలి తీర్చానని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి,పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు.
వాయిస్ ఓవర్:- పిఠాపురం కాయగూరల మార్కెట్ సెంటర్ వద్ద వర్మాస్ కావ్యా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ను టీడీపీ నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ సందర్శించారు.పేదలకు మాజీ ఎమ్మెల్యే వర్మే స్వయంగా వడ్డించి,వారితోపాటు ఆయన కూడా భుజించారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడుతూ.,ఆగష్టు 15 నుంచి కూటమి ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభించనుందని,ఇకనుంచి పేదలంలరూ అన్నాక్యాంటీన్లలో వారి ఆకలిని తీర్చుకోవాలని విజ్ఞప్తిచేశారు.ఈ నాలుగున్నరేళ్ళూ అన్నా క్యాంటీన్ నిర్వహణకు సహకరించిన పార్టీ నాయకులకు,కార్యకర్తలకు,నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొండేపూడి ప్రకాశ్,పిల్లి చిన్నా,నామా దొరబాబు,స్వామిరెడ్డి అప్పలరాజు,సఖుమళ్ళ గంగాధర్,సోము సత్తిబాబు,సూరవరపు సుబ్బారావు,నల్లా శ్రీను,చవ్వాకుల రామచంద్రరావు,రావుల రమేశ్,నూతాటి ప్రకాశ్,శీరం భద్రరావు,ఆలం దొరబాబు తదితరులు పాల్గొన్నారు..