సిరా న్యూస్,గుంటూరు;
గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెనాలి బ్రెయిన్ డెడ్ యువతి సహన కుటుంబ సభ్యులను టీడీపీ నేతలు ఆలపాటి రాజా, నక్కా ఆనంద్ బాబు మంగళవారం పరామర్శించారు.
టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు మాట్టలాడుతూ తెనాలి పట్టణంలో గత2రోజుల క్రితం దాడికి గురైన యువతి సహనాని పరామర్శకు వచ్చాం. వైసీపీ నేతలు దీనిపై పూటకొక రాజకీయం చేయడం, దానికోసం ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గుంటూరు కు రావడం అంటే నవ్వొస్తుంది. గత వైసీపీ హయాంలో మహిళలపై జరిగిన దాడులు హత్యలు మరచిపోయారేమో అనిపిస్తుంది. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని చంద్రబాబు నాయుడు వైద్యులకు సూచించిన సంగతి తెలిసిందే. .వైసీపీ ప్రభుత్వం తయారు చేసిన మూలాల ఇంకా బ్రతికే ఉన్నాయని వాటిపై టీడీపీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటాయని హెచ్చరించారు. సహనకి అన్నిరకాల సహాయక వనరులు సత్వరమే అందిస్తామని హామీ ఇచ్చారని అన్నారు.
ఆసుపత్రి సుపరేండెంట్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చేసమయానికి యువతి సహన ఆరోగ్యం దారుణంగా ఉంది. ఇక్కడకు రాగానే అన్నిరకాల వైద్యసేవలు అందిస్తున్నాం. యువతి ఆరోగ్య పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అత్యంత క్లిష్టమైనఆరోగ్య పరిస్థితుల నేపధ్యంలో వైద్యం అందిస్తున్నామని అన్నారు.
ఆలపాటి రాజా మాట్లాడుతూ సహనా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. సహనా జీవనం కోసం ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వైసీపీ నేతలు సహనా విషయంలో రాజకీయ రంగుపులమాలని చూస్తుండటం సిగ్గుచేటు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి గంజాయి రాజ్యాంగా మార్చారని వైసీపీ నేతలు దుయ్యబట్టారు బాధితులకు సహాయం అందడం లేదని వైసీపీ నేతలు మాట్లాడటం సిగ్గుచేటు. సహనా విషయంలో వైసీపీ నేతలు మాటలు మాట్లాడటం మానుకుంటే మంచిదని హితవుపలికారు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో విద్వేషాలు సృష్టించాలని చూస్తే చంద్రబాబు చూస్తూ కూర్చోవడం జరగదని గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి గుంటూరు పర్యటన చేస్తే ఏమైన భూమి బద్దలవుతుందా అని ఎద్దేవా చేశారు.సహనా విషయంలో నేరస్తులు ఎంతటివారైనా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సహనా కుటుంబ సభ్యులకు టీడీపీ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు….