సిరాన్యూస్, నాంపల్లి
సీఎం చంద్రబాబు నాయుడిని కలిసిన నాంపల్లి టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి మంగి మహేష్
ఎన్టీఆర్ ట్రస్ట్ భవనంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును మంగళవారం నల్గొండ జిల్లా నాంపల్లి టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి మంగి మహేష్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈసందర్బంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ తెలంగాణలో తెలుగదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలన్నారు. పార్టీ కోసం పని చేసే వారి ఫలితం ఉంటుందన్నారు. అనంతరం సీఎం చంద్రబాబు నాయుడుని శాలువాతో ఘనంగా సన్మానించారు.