తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు
మంచూరి సూర్యనారాయణ రెడ్డి
సిరా న్యూస్,బద్వేలు;
రాష్ట్ర ప్రజలకు భరోసా కల్పించేందుకు, జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ నాయకుల అరాచకాలకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పూరించిన నాధమే శంఖారావమని బద్వేలు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు క్లాస్ వన్ రైల్వే కాంట్రాక్టర్ మంచూరి సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ యువగళం పాదయాత్రలో నారా లోకేష్ పర్యటించని నియోజకవర్గాల్లో శంఖారావం పేరుతో పర్యటించి జగన్ రెడ్డి ప్రభుత్వ దౌర్జన్యాలపై ప్రజలకు, కార్యకర్తలకు తెలియజేయనున్నారని ఆయన తెలిపారు. నిరుద్యోగంతో యువత ఇబ్బందులు పడుతుండగా, ధరల పెరుగుదలతో రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. నారా లోకేష్ రాష్ట్రవ్యాప్తంగా శంఖారావం చేపట్టనున్నారని ఇందులో భాగంగా రానున్న 40-50 రోజుల్లో 120 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నారా లోకేష్ పర్యటించనున్నారని తెలిపారు. ఒక్కరోజులో మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో శంఖారావం కార్యక్రమం జరుగుతుందని తెలిపారు.శంఖారావం ద్వారా బాబు షూరిటీ -భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు వివరిస్తూ ప్రతి ఇంటికీ చేరువవుతారని తెలిపారు. ఇప్పటికే యువగళం పాదయాత్ర పేరుతో రాష్ట్రవ్యాప్తంగా అన్నీ గ్రామాల్లో, పట్టణాల్లో నారా లోకేశ్ పర్యటించి జగన్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలపై, అరాచక పాలనపై గొంతెత్తి ప్రజలకు మద్దతుగా నిలిచారన్నారు. వైఎస్సార్సీపీ నేతల అవినీతి, అన్యాయానికి వ్యతిరేకంగా 220 రోజుల పాటు 3132 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారన్నారు. జగన్ రెడ్డి ప్రభుత్వంలో బాధితులుగా మారిన అన్ని వర్గాల ప్రజలకు పాదయాత్ర ద్వారా నారా లోకేష్ భరోసా ఇచ్చారన్నారు. యువగళం పాదయాత్రను ఉత్తరాంధ్రలో కొనసాగించాలనుకున్నా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ తో అడ్డంకులు ఎదురయ్యాయన్నారు. శంఖారావం పార్టీ కార్యకర్తలు నారా లోకేష్ వైపు మరింత చేరువయ్యేలా చేస్తుంద న్నారు. ఈ కార్యక్రమం ద్వారా కార్యకర్తలు నేరుగా నారా లోకేష్తో తమ అభిప్రాయాలను పంచుకునే అవకాశం ఉంటుందని సూర్యనారాయణ రెడ్డి ఉన్నారు కేవలం 70 రోజుల్లో రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం పడిపోవడం ఖాయమని తెలిపారు తెలుగుదేశం జనసేన పార్టీలు సంయుక్తంగా పాలనలోకి వస్తాయన్న ఆత్మవిశ్వాసాన్ని ఆయన వ్యక్తపరిచారు. తెలుగుదేశం జనసేన పార్టీలను అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రజలంతా ఇప్పటినుంచి సిద్ధంగా ఉన్నట్లు సూర్యనారాయణ రెడ్డి తెలిపారు