సిరాన్యూస్, బేల
పాఠశాలకు ప్లేట్లను అందజేసిన ఉపాధ్యాయుడు బి. రమేష్
ఆదిలాబాద్ జిల్లా బేల మండలం చప్రాల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్నం భోజనం కోసం విద్యార్థులకు సైన్స్ ఉపాధ్యాయుడు బి రమేష్ ప్లేట్ లను పంపిణీ చేశారు. అదే పాఠశాలకు చెందిన సైన్స్ ఉపాధ్యాయుడు బి రమేష్ తన పూర్వ విద్యార్థి సుమేద్ బోధితో కలిసి రూ.10వేల విలువైన ప్లేట్లనును కొనుగోలు చేసి శనివారం విద్యార్థులకు అందజేశారు. ప్రధానోపాధ్యాయుడు కే రమేష్ కు ఉపాధ్యాయులు, విద్యార్థులు వారికి కృతజ్ఞతలు తెలిపారు.