సిరాన్యూస్, బోథ్
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నగంగాసాగర్
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని మందబొగడ పాఠశాల ఉపాధ్యాయుడు గంగాసాగర్ ఉత్తమ ఉపాధ్యాయు అవార్డు అందుకున్నారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ హాల్ లో ఉపాధ్యాయుడు గంగాసాగర్‌కు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఆదిలాబాద్ శాసన సభ్యులు పాయల శంకర్‌లు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందజేశారు. ఈసందర్బంగా ఉపాధ్యాయుడు గంగాసాగర్‌కు పలువురు అభినందనలు తెలిపారు.