సిరాన్యూస్, ఆదిలాబాద్
ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు అందుకున్న పెంటపర్తి ఊశన్న
* పెంటపర్తి ఊశన్నకు అభినందనలు వెల్లువ
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ హాల్ లో ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డును జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎమ్మెల్యే పాయల్ శంకర్ , జిల్లా విద్యా శాఖాధికారిల చేతుల మీదుగా పెంటపర్తి ఊశన్నకు అందుకున్నారు. ఈసందర్బంగా వివిధ సంఘాల నాయకులు అభినందనలు తెలియజేశారు. అనంతరం సన్మాన గ్రహీత పెంటపర్తి ఊశన్న శారద దంపతులను శాలువా కప్పి, పూల బోకెలతో ఘనంగా సన్మానించారు. జైనథ్ మండలంలోని ఆనంద్ పూర్ గ్రామ వాసి, ప్రస్తుతం ఇదే మండలంలోని ప్రాథమికోన్నత పాఠశాల, జామినిలో ఉపాధ్యాయుడిగా విధులను నిర్వహిస్తున్నారు. అవార్డు అయిన రివార్డు అయినా అది బాధ్యతో కూడుకున్నదాని వ్యక్తులు అన్నారు. ఉపాధ్యాయ వృత్తి చాలా గొప్పది అని కొనియాడారు. కార్యక్రమంలో టీఎస్‌యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆశోక్, స్వామి , పీఆర్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నవీన్ యాదవ్, టీయూటీఎప్ జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్, డీటీఎఫ్ జిల్లా అధ్యక్షాప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్, వృకోధర్, గంగయ్య, మహేంద్ర, కిష్టన్న, మహేందర్ రెడ్డి, కత్తి శ్రీహరి, యం ఈ ఓ ఉదయ్ రావ్, పసుల ప్రతాప్ , జన విజ్ఞాన వేదిక రాష్ట కార్యదర్శి నూతుల రవీందర్ రెడ్డి, భావాని ఆనంద్, రెగ్యులర్ వాకింగ్ టీం, శంకర్, చిన్నయ్య, సంతోష్, శ్రీనివాస్,రాజు తదితరులు పాల్గొన్నారు.