సిరాన్యూస్, కళ్యాణదుర్గం
గుండెపోటుతో ఉపాధ్యాయుడు రామ్మోహన్ మృతి
కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు రామ్మోహన్ గుండెపోటుతో మృతిచెందారు. రామ్మోహన్ బ్రహ్మసముద్రం మండలం రాయలదొడ్డిలోని జడ్పీ పాఠశాలలో తెలుగు టీచర్‌గా పని చేస్తూ, కళ్యాణదుర్గంలో నివాసముంటున్నారు. స్నానానికి వెళ్లే సమయంలో ఛాతిలో నొప్పి రావడంతో ఆసుపత్రికి తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే రామ్మోహన్ మృతి చెందినట్లు నిర్ధారించారు.